అలుకమాన్పుట

అలుకమానమనుచు నర్ధాంగి నీరీతి
భుజగభూషనుడిట్లు బుజ్జగించు
శిల్పంబునూహించు శిల్పిచతురతంత
ఆశ్చర్యమనిపించ నతిశయంబె
నరులకే కాదోయి నాగేంద్రుకైనను
సతినియలుకతీర్చ సాధ్యమగునె
నయగార మొప్పగా నటరాజు కాబట్టి
అలుకతీర్చగలగు నభవుడతడు
ఆ.వె.భారతీయ కళలు భవ్యమైదివ్యమై
జ్ఞాన దృష్టినొసగు జ్ఞాత నేర్చు
కళలు కేవలంబు కళలకేకాదోయి
ఆత్మదృష్టినొసగు నధ్భుతంబు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత