సాలోక్య,సామీప్యసారూప్య సాయుజ్యాలుఈ
నీవున్న లోకాన నిలిచినామేలౌను
సాలోక్య ముక్తియే సంఘటిల్లు
నీచెంత నిరతంబు నిలిచినామేలౌను
సామీప్యముక్తియే సంభవించు
నీరూపు మదిలోన నిరతంబునిలిపినా
సారూప్య ముక్తియె సంభవించు
నీమూర్తి మదిలోన నిరతంబు నిలుపగా
సాయుజ్యముక్తియె సంభవించు
అన్య చింత మాని అచ్యతు మూర్తిని
మదిని నిలుపు భక్తి మాకు నిమ్ము
నిన్ను నమ్మినట్టి నీభక్తాళికెపుడు
శ్రేయ మొసుగు మయ్య శ్రీనివాస
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి