మేను వాల్చుమోయి

ధరణిమాత వడినెతల్పంబుగాదల్చి
నిద్రచెందుసుఖము నీకు దక్కె
పట్టుపానుపుకన్న పరమసౌఖ్యంబిచ్చు
ఇహలోక మౌనింక యింద్ర పదవి
ఏరాజుకున్నదో యీరాజ సంబిట్లు
రాజుకన్ననుమేలు రైతు యెప్పుడు
కలిగున్నదానితో కడుపార భుజియించ
ఆదమరపునిద్రయావహించు
చింతలేనినరుడు సంతలో నిద్రించు
అనినమాటకిదియె యర్త మేమొ
ఆ.వె పిసిని గొట్టుకెపుడు పీడకలలనిద్ర
ధనముపైని చింత దయ్యమట్లు
తస్క రింప లేని ధనికుండు ధరలోన
పేదవాని కన్న పెద్ద యెవరు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత