పరమేశు ప్రార్థింతుభక్తితో నేను
పరమేశు ప్రార్థింతు భక్తితో నేనింక
బాహ్యోప చారాల భయము లేదు
మనసులో నేనింక మహనీయ మూర్తిని
ధ్యానింతు పూజింతు తత్త్వ మెరిగి
రత్నపీఠమునంత రమణీయమౌరీతి
రంగవల్లులతోడ రంగరించి
హాయినొసగునట్టి యాహ్లాద మౌరీతి
మజ్జనంబొనరింతు మనసు దీర
దిక్కులెల్ల నీకు దీటైన వస్త్రాలు
వ్యాఘ్ర చర్మమేమొ వలువయాయె
కాలకూట విషము కంటహారంబుగా
చేసు కొంటి వీవు చేతులార
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి