అందాల రాముడు
అందాల రామునియపరూపరూపంబు
అందానికేనిట్లు నంద మోయి
అందాలు చిందించు యరవింద నేత్రాలు
అందాని కేయిచ్చు నంద మంత
ఆజాను భాహని యందమ్మే యందమ్ము
కమనీయ మౌమోము కనుల విందు
మృగరాజ మధ్యంబుహృద్యమౌ గళసీమ
చూచిన వారివే చూడ్కు లయ్య
చిరు నవ్వు చిందిచుచిరుదర హాసంబు
తనివార చూచినా తక్కు వోయి
ఆవె.రాము డన్న పిలువ రంజిల్లు హృదయంబు
త్యాగ రాజ మదిని దాగినాడు
శరణుకోరినట్టి శత్రు వైననుతాను
అండనిత్తు ననుచు నాన సేసి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి