బాలుడౌ రాముడు

బాలుడౌ రాముడు భక్తాంత రంగుడై
పరమపదము నిచ్చు భక్త తతికి
సాకేత్ రాముడై సాన్నిధ్య భాగ్యంబు
శరణన్నవారికి సన్ని హితుడు
అయొధ్య రాముడై నఖిలాంత రాత్ముడై
అర్థిజనులనెల్ల నాదుకొనును
జానికీ జానియై జనకుజామాతయై
ఆశ్రితవాత్సల్య మవనికిచ్చె
ఆ.వె.అర్తి జనుల కెల్ల నభయమొసగునట్టి
ఆర్యపుత్రుకన్న నాఢ్యుడెవరు
శరణు కోరి గానె శాఠ్యంబు నశియించు
పూర్వ పుణ్య మిదియె పుడమిలోన
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత