కళ్యాణదుర్గం
కళ్యాణ దుర్గాన గడిచినకాలమ్ము
మరచిపొదుమనిన మతికిరాదు
చదువలమ్మవడినచదివినచదువంత
స్పురణకొచ్చినయంత స్పూర్తినిచ్చు
మలుపుతిప్పినయట్టిమధురమౌఘట్ఝాలు
ఆంగ్లబో ధనమును నసదృశమైరీతి
అరచేతియరటిలో నందజేసి
ఆత్మవిశ్వాసమునందజేసినయట్టి
ముందుకునడీపిన ముఖ్యుడతడు
బాలభీమప్పగా ప్రఖ్యాతు డైనట్టి
ఆంగ్లొపాధ్యాయుండునాప్తుడతడు
సాంఘిక శాస్త్రాన్ని సారస్వ్యమైరీతి
నేత్రపర్వమటులనేర్పెనతడు
ఆ.వె.చదువు సంధ్యలెల్ల చక్కగానేర్పిన
తల్లి కిట్లు నేను దండమిడుదు
అదిగొ కనుడు మీరు నక్కమ్మ కొండను
బాల్యమిట్లు గడిచె భాగ్యమట్లు
(రచన-:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి