వెంకటేశ్వర సుప్రభాతం
అమృతోపమానమ్మయానంతచార్యల
సుప్రభాతరచనసుందరమ్ము
చెవులుపెట్టినధాత చేష్టితాన్నిపొగడ
యోగ్యతేమికలదుయిలనుమనకు
సుమధరధారగా సుధనుకురియజేయు
అమ్మపాలనుబోలు నమృతమంత
ఆనందనిలయునియనురాగమంతయు
మాకునొసగినావు మమతతోడ
ఆపాతమధురమ్మునాలికించినచాలు
బ్రహ్మానుభూతియే మాకుకలుగు
ఆ.వె సూరి జనుడవీవు సుందరమూర్తిని
కన్నులారా నీవు కాంచినావొ
లేకయున్నయిట్లు లేవడెవరురాయి
నీకు నీవె సాటి నిజముగాను
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి