ముగ్ధభక్తి
ముగ్ధ భక్తి కతడు మోదమందునెపుడు
లాస్యంబు నెరిగిన లలితుడతడు
శరణువేడినయట్టి చంద్రుణ్ణి తలపైన
మోదంబుతళుకెత్త మోసెనతడు
కాలకూటవిషము కంగారు పెట్టగా
గొంతులో దాచిన గొప్ప వాడుమ
శిరమున గంగమ్మ చిందుల నెల్లను
చిరునవ్వుతో నంత చిన్న బుచ్ఛు
ఆ.వే. ఉర్వి కెల్ల నేను నున్మత్త పుష్పంబు
దరిని చేర రెవరు దయను వీడి
పొగిలి యేడ్చు విరిని పొందుగా శిరముపై
పెట్టు కొనిన యట్టి పెద్ద బుధ్ధి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి