భీష్ముడు
గంగమ్మ పుత్రుండు గంభీరహృదయుండు
పితృభక్తి కితడోయి పెద్దదిక్కు
తండ్రిమనసెరిగి త్యజియించె రాజ్యంబు
తృణ ప్రాయ మట్లుగా తృష్ణలేక
స్వచ్ఛంద మరణంబు జనకుచే వరముగా
స్వీకరించిన యట్టి శ్రేష్టుడితడు
వెన్నుని నామాలు వేనోళ్ళ కీర్తించి
వివరించి మనకిచ్చి వెడలినాడు
దేవ వ్రతుడనుచు దేవతల్ కీర్తించు
శంతను పుత్రుండు శాంతనవుడు
ఆ.వె.ధర్మ పక్ష పాతి ధర్మంబుకొరకునై
అసువులొడ్డినట్టి యాత్మమయుడు
భారతేతి హాస భాగ్యవిధాతగా
మదిని నిల్పుకొన్న మంచివాడు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి