అందాలరాముడు
అందాలరామడవనిలోనెకాదోయి
అంతటానున్నట్టి యాద్యశక్తి
చీమలోదోమలో శివకేశవులలో
రాజీవనేత్రుడై రాముడుండు
నీలోననాలోన నిఖిలాంతరాత్ముడై
ఆత్మరూపుననున్న యాత్మమయుడు
రాయిలోననేకాదు రమ్యవౌరీతిగా
తరులందుగిరులందు తానెయుండు
ఆ.వె.వెదికి చూడవలయువేసారిపోకుండ
శ్రధ్ధభక్తులెల్ల సాధనాలు
అతడులేనితావుయసలేమిలేదోయి
నిపుణమతిని నిచ్చు నిష్ట యున్న
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి