మంచిమిత్రుడు
ఆత్మీయ మిత్రుడు నండగానుండగా
కొరతేమి వుండును కువలయాన
మనమాచరించెడి మంకుపనులనెల్ల
మనసార నవ్వెటి మనసువాడు
చక్కనౌ సూచనల సరియైనసమయాన
అందించు హితుడైనయాప్తుడతడు
వేలాది మైళ్ళైన వైళంబ మనకొరకతడు
ఆఘమేఘాలపై యరుగుదెంచు
ఘనకార్యమొనరించ కరతాళ ధ్వనులు
మిన్నుమిట్లొరజేయుమిత్రుడెపుడు
ఇడుములందునుకూడ నిముసమైననుకూడ
కనిపెట్టి మిత్రుండు కాచియిండు
ఆ.వె.ఇట్టి మిత్రుడుండ యింద్రపదవికూడ
పోలదెపుడు మనకు పుడమిపైన
హితము కూర్చు సన్నిహితునిమైత్రివరము
నాగరాజు మాట నమ్ముమింక
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి