విద్య---సమాజిక కర్తవ్యము
విద్యాలయాలు పునఃప్రారంభం,నూతన విద్యాసంవత్సరం విద్యార్థులముంగిటవుంది.నూతనోత్సాహంతో బాలబాలికలు పాఠశాలలకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.తల్లిదండ్రులకూ ఆనందమే.తమ సంతానం మార్కులతో (గ్రేడలతో) ర్యాంకులపంట పండించాలని ఉవ్విళ్ళూరుతున్నారు.విద్యసకలార్థసాధనమని,సకలసమస్యలకూ పరిష్కారమార్గమంటారు పెద్దలు.మనపాఠశాలలు విద్యాలయాలు ప్రతియేటా లక్షలాది విద్యావంతులను ఉత్పత్తిచేసె పారిశ్రామిక కేంద్రాలయాలయాలయినాయి.ఎందరో మేధావులు ప్రతిభాసంపన్నులు తయారవుతున్నారు కదా! అయినా నేటిసమాజంలోని సమస్యలన్నీ పరిష్కారమయ్యయా అంటే అనుమానమే.భావిభారతం తరగతి గదిలోనే ఆవిర్భవిస్తుందని మేధావులు మాట!
"విద్"అనే ధాతువు నుంచి విద్య అనే పదం ఉత్పన్నమైంది."విద్" అంటే జ్ఞాన మనిఅర్థం. అజ్ఞానమనుతొలగించేదని యర్థము. అజ్ఞానమనే అంధకారమును తొలగించి జ్ఞానమనే దీపాన్ని వెలిగించాలి విద్య. అప్పుడే విద్యకు ప్రయోజనము.విద్యవల్లనే జీవితం అర్థమంతమవుతుంది.
"చదవాడ అజ్ఞుండగు
చదివిన సదసద్వివేక చతురతకల్గున్"
అంటాడు బమ్మెర పోతన.
కాని ప్రస్తుతవిద్యావిధానంలో విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడానికి బదులు ,విద్యార్థుల బుర్రల్లో సమాచారాన్ని కూరుడమే విద్యాబోధన గా భావించడం జరుగుతుంది.(,ప్రస్తుతం కరోనా దెబ్బతో అమలవుతున్న ఆన్ లైన్ విద్యాబోధన మరింత సమాచారం నింపడం జరుగింది,జరుగుతుంది).అందువల్ల విద్యార్థి లోకము అశాంతికి గురి అవుతున్నది.
విద్యార్థి లోకానికి ప్రస్తుతం కావాల్సింది సదసత్ వివేకచతురత కావాలి.అది కలిగించడమే విద్య యొక్క నిజమైన లక్ష్యం కావాలి.
"Man making, charector building,assimilation of ideas."is real education.అని వివేకానందస్వామి వారి మాటగమనార్హము.వ్యక్తిత్వవికాసము,శీలనిర్మాణము,హృదయం వికాసము కలిగించేదే నిజమైన విద్య అనే మాట అక్షర సత్యము.
ఒకవ్యక్తి ఎంత చదువుకొన్నా, సంస్కారము లేకపోతే అటువంటి వ్యక్తి వల్ల సమాజానికి అన్నీ సమస్యలే.నైతతికతకు ప్రాధాన్యమివ్వని అభివృధ్ధి విషతుల్యం అని అన్నారు గాంధీజీ.
ప్రస్తుతం ఆ మాట అక్షరసః నిజం.U--tube channel ల్లో వస్తున్న అంశాలను చూచి యువత చేస్తున్న నేరాలు ఘోరాలు మనకు తెలిసినవే.
"చదువది యెంతకల్గిన రసజ్ఞత యించుకచాలకున్న యా
చదువు నిరర్థకంబు గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్
పొదుపుగా మంచికూర నలపాకముచేసిననైన
నందిపొదవెడు నుప్పులేకరుచిపుట్టగ నేర్చునటయ్య భాస్కరా!"అని మారదవెంకయ్య తన భాస్కరశతకంలో అన్నాడు.
చదువెంతవున్నా సంస్కారవంతమైన హృదయము లేనప్పుడు,ఆ చదువు నిరర్థకమే కదా! ఎంతబాగా రుచిగా వండిన అందులో కాసంత ఉప్పులేనప్పుడు రుచిపుట్టునా? పుట్టదు కదా!
ప్రేమ,సేవ,దయా,నిస్వార్థం మొదులైన మానవీయ విలువలు వున్ననాడె మానవుడు సంస్కారవంతుడౌతాడు.
ఒక కాకి కొంత ఆహారం దొరికిని తన తోటి కాకులను కాకా! అంటు పిలుస్తుంది.ఒక ఏనుగు ఊబిలో కూరుకుపోతే తోటి ఏనుగులు దానిని బయటకు లాగాలని శ్రమిస్తాయి.ఆపదలో వున్నవారికి ఆపన్నహస్తం అందించాలనే సంస్కారము నోరులేని మూగజీవాలకే వున్నప్పుడు సకలవిద్యలను అభ్యసించిన మానవులకు మరెంత సంస్కార ముండాలో ఆలోచించాలి.
ఈ సందర్భంగా సంస్కృత శ్లోకం గుర్తుకు వస్తుంది.
"విద్యాదదాతి వినయం వినయాత్ యాతిపాత్రతాం
పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాత్ ధర్మం తతః సుఖం"
విద్యవల్ల వినయము,వినయ వల్ల పాత్రత(వ్యక్తిత్వం) ఆ వ్యక్తిత్వం వల్ల ధనము సమకూరుతుంది ధనమును ధార్మిక కార్యక్రమాల్లో వినియోగించడం వల్ల సుఖం లభిస్తుంది.ఇది పెద్దలమాట.
కావున మనం విద్యయొక్క పరమార్థం ధనసంపాదనకే కాక సమాజశ్రేయస్సునకు కృషి చేసినట్టు డే మానవ(మన)జన్మ సార్థకం మౌతుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి