.ఏకాంతవేళ

ఏకాంత లేనట్టి యేకాంత వేళలో
వినువీధి నీకిచ్చు వింత హాయి
గగనమ్ము చూపునుగమ్మత్తు  నీకింక
మేఘమండలమంత మేల మాడు
సుధలెల్ల యందించ సౌధామినినియంపె
సోముండు మామయై షోకుచూప
ఆకాశ వీధంత యందాలు చిందించ
జాబిల్లి పిలిచేను  చాల నిన్ను
ఆ.వే‌.చంద మామరావె జాబిల్లి రావంచు
అమ్మ పిలుపు లోని యార్ద్ర తంత
చందమామ చూపు సంతతా నందమ్ము
చంద నంపు తావి చక్క గాను
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత