నామస్మరణ
గోవింద గోవింద గోవింద యనుచును
స్నానంబు చేయగా సాగుమోయి
అనునిత్యమచ్యుతు నంతరంగమునందు
ధ్యానమ్ము చేయగా ధ్యాస యడుము
గోవింద గోవింద గోవిందా యనుచును
స్మరియింప వలెనయ్య సాదుహృదయ
హరిలీల లెల్లను నహరహ మందున
కీర్తించ వలెనయ్య భక్తితోడ
ఆ.వే.శయన సమయ మందు శంకరు ధ్యానంబు
ఆత్మరక్ష నొసగు నధిక మగను
మరువబోకు మయ్య మాధవు సంకీర్తి
ఇహము పరము లన్ని యిచ్చు తానె
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి