భారతగణతంత్రము

భవ్యమౌ దేశంబు భరతదేశంబిది
గణతంత్ర రాజ్యమై ఘనత కెక్కె
వేదాల నిలయంబు విద్యకే పట్టము
విద్వాంసు లున్నట్టి విమల తలము
త్యాగ మూర్తులు కన్న తల్లియౌ భరతాంబ
వీరాధి వీరుల శూరాది శూరుల
జన్మమ్ము నిచ్చిన జనని తాను
సహనమ్ము సత్యంబు సామరస్యము
జగతికి నేర్పిన జన్మభూమి
అమృతమూర్తులన్నయక్షరసత్యంబు
విశ్వానికందించు విమల తలము
సుజలాలసుఫలాల సుమధురదేశమ్ము
పాడిపంటలుపండుభాగ్యసీమ
ఆ.వె.జనని జన్మభూమి స్వర్గాని కన్నను
ఘనతయనెడుమాట కల్లకాదు
ఇట్టి పుణ్యభూమి యిలలోన లేదోయి
మరలపుట్టవలయుమారుమారు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత