అవతార తత్త్వము

అవనిభారమునంత యణిగింప గాతాను
యుగయగములనుండి యుర్వి కొచ్చి
సాధుజనులకెల్ల స్వాత్మానుభూతిని
సత్యధర్మరతిని సాధ్య పరిచి
దుష్టదనుజులెల్ల తూలిపడగజేయు
అరవిందనేత్రుండు నవనికొచ్చె
ప్రహ్లాద వరదుండు ప్రహసిత వదనుడై
ఆనంద మంతను నందజేసె
కనకాక్షుడంతను కావర మందంగా
సూకర రూపుడై  సుగతి కంపె
ఆ.వే. వేణు ధారియైన వేదవేద్యుడతడు
నిగమ శిఖల లోని నిత్యు డతడు
అతని యాశ్ర యింప యానంద మగుజన్మ
కొరత లేని వారి కోర్కె యతడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత