నైతికత --,నియమాలు
ఆచరించవలెను నత్యంత శ్రధ్ధతో
నిజజీవితంబున నిష్ట తోడ
ప్రార్థించవలయును పరిపూర్ణ హృదయాన
నమ్మకమ్మువలయు నడత కెపుడు
మదినితర్కించక మాటతూలకెపుడు
మోవిదాటుపలకు మోస మొదువు
ఆర్జనమ్ముతొలుత యాచరించవలయు
వ్యయముకన్నను వాస్త వమ్ము
అభిభాషణముకన్న నభ్యసింపుతొలుత
సాధుభాషవలన సాధ్యమగును
ఆ.వే. ఓట మొచ్చు ననచు నాటవీడుటకన్న
యత్న పడుట మేలు జగతి లోన
చావు కొరకు కాక చేవకొరకునీవు
బ్రతక వలెను కాదె పసిడి యిట్లు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి