భోగి మకరసంక్రాంతి

గోవర్ధనోధ్ధారి గోవర్ధనమనెత్తి
గోపకుల్ కాచిన గొప్ప రోజు
పాతాళముననుండి బలిసార్వభౌముండు
అవనికేతించిన యదియునేడె
ఆముక్తమాల్యద యలరంగనాథుని
మనువాడినయట్టిమంచిరోజు
పాడిపంటలతోడభాగ్యంబు 
హాలికుల్ 
మోదంబు పొందిన మొదటిరోజు
భోగీంద్రు శయనుండు భాగ్యంబు నొసగిన
దివ్యమౌ భోగియె నేడుకలిగె
ఆ.వె.బాధపెట్టు నట్టి పాత జ్ఞాపకుములనెల్ల
భోగిమంటలందు పారబోసి
మార్పుచెందదగునుమకరసంక్రణమందు
నాగరాజు మాట నమ్ము వలయు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)
మార్పుకోరెప్రకృతిమకరసంక్రమణాన
హేమంత మందున హేమమట్లు
పాడిపంటలతోడ  భాగ్యమమరినట్లు
హాలికుడంతట హర్ష మందె
భగవంతునాటలో భ్రమణమందుమనము
ఆటలో మనమంతా యరటిపండ్లె
ఆముక్తమాల్యద యయ్యంత రంగుని
హృదయాననిలుపు హృద్య రీతి
కృష్ణరాయలు తెల్పి కృతకృత్యుతనుపొందె
ఆ.వే.కనుము కనమనుచును కనుమపండగ తెల్పు
త్యాగి యెకడె జగతి భోగి యనుచు
భోగిపండుగతెల్పె యోగియట్లుమనకు
క్రాంతి పథమె మనది కడకు మనకు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత