కశ్యప సూనుండు

కశ్యప సూనుండు కరుణార్ద్ర చిత్తుడు
జగతికే వెలుగిచ్చు జాలిగుండె
గ్రహములకెల్లనుగ్రహములొసగుచున్న
భానుండు మాకేమొ బాసటాయె
ఆదిత్య తేజమ్ము నందించు సర్వమ్ము
అన్నమొసగునట్టి యాప్తు డతడు
ఏకచక్రముతోడ యేలను జగతంత
ఏడుగుర్రాలకు యేలికతడు
ఆకాశమార్గాన యరుదెంచు భానుని
కమలాప్తు డనుచును కాంచు మోయి
ఆ.వే.అతని వలన కాదెయారోగ్య మందును
పాడి పంట లుండు భాగ్య మొదువు
సకల సృష్టి కతడు సాకార మందించి
మనలో కాచు నట్టి మంచి సఖుడు
(విద్వాన్ గొల్లాపిన్నిఆరోగ్యమొసగగా 
ఆరోగ్యాయమొసగగా దిత్యుడుండగా
చింతపడగనేల చిన్నవాడ!
వందనాలతెలుప
 వరమిచ్చువేలుపు
దరహాస వదనుడై ధనము నొసగు
ఇహముపరములిచ్చు యీశ్వరుండితడయ్య
భాస్కరుండితడయ్యబాగుకోరు
పాడిపం టలనిచ్చి  భవితవ్యమొసగేటి
కశ్యప సూనుండు కర్మసాక్షి
ఆ.వే .అతడు లేక జగతి యణువంత సాగదు
అతడు యెపుడు మనకు నాప్తు డయ్య
మిత్రు డగుట.వలనె మైత్రిచూపునతడు
కమల బాంధ వుండు కనుము నీవు
(రచన:౼విద్వాన్ నాగరాజ శాస్త్రి) నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత