మానవహక్కులా

మానవ హక్కులు మసిబారి నేమిట్లు
మంటగలసెనిట మంచిదనము
నరరూప రాక్షసుల్ నలవైపు లారేగి
మానభంగమ్ముగా మార్చినారు
మనుజత్వమనుమాట మచ్చుకైన లేదింక
దనుజత్వానికిదియె దారియాయె
దుష్టాత్ము లేరీతి దుర్మణ మందిరి
వారిహక్కులమాట వార్త యాయె
ఆ.వే.హంత కులకు కిట్లు హక్కులొదవగానె
హతుల సంగ తేమి యవనిలోన
నగవు లాట కాదు న్యాయమనగనింక
ధర్మ రక్ష యెకటె తనను కాచు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత