ఆంగ్లవత్సరాది

ఆంగ్ల వత్స రాది.అర్ధరాత్రియతిథి
తాగివాగి తూగి తరలిపోవు
మత్తుదిగిన వెన్క మతిబోవు మనకెల్ల
ఆదరించ వలుదు ఆంధ్రులార

నిశిరాత్రి వేళలో నిబిడాంధ కారన
నడురేయి దాటగా నర్తనంబు
తప్పతాగిజనులెల్ల తైతక్క లాడగా
ఆనంద మన్నట్లు యభినయంబు
అరుపులూ కేకలూ యల్లరే యల్లరి
ఇదియేమి పబ్బమ్ము యిలను గనము
పొరుగుదేశపువారి పొడబాట్లు మనకేల
ఇంగ్లీషు వారిదౌ యెంగిలేల
జనవరొకటియంచు జపమేల సేతువు
తెలుగువారికింక.తెన్నులేదె
షడ్రుచులుతెలపు సంవత్సరాదియౌ
ఉర్విజనులుగాది నుత్తమమ్ము
రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత