వివాహ బంధము

సుమహూర్త సమయాన చూపులు క లువగా
అనురాగలతయంత యల్లుకొనును
మాంగల్య బంధమ్ము మమతానురాగాల
ఆత్మీయ బంధమై యల్లుకొనును
అక్షతారోపణ రానందసాంద్రమై
అన్యోన్న బంధమై యల్లుకొనును
సప్తపదులతోడి సన్మిత్రబంధమ్ము
కల్పలతికవోలె కాంక్షదీర్చు
ఆ.వె.తలుపుపలుకలందు ధర్మార్థకామాల
నీదు మాటమీర నీక్కమనుచు
బాసచేయును వరుడువధువుతోతానంత
అర్షధర్మమిదియె  యవనిలోన
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత