చంద్రోదయము
చంద్రోదయము(వాల్మికీమహాకవి ప్రేరణతో)
----------------------------------------------మానససరసిలో మదమరాళమటుల
ఉడువీధి చంద్రుండు నుదితుడాయె
సురభిసంఘమునందు సౌరభేయమటుల
గగనాన చంద్రుండుకలయదిరిగె
పాపాలు నశియింప తాపాలుశమియింప
శీతాంశుకిరణుండు శైత్యమొసగె
పర్వతమధ్యాన పంచాస్యమట్లుగా
వెన్నెలలు వెదజల్లె వెలుగురేడు
ఆ.వె.రజిత పంజరానరాజిల్లుహంసమ్ము
శిలలపైన నున్న సింగమట్లు
కదనరంగమందు ఘనవీరుడట్లుగా
వెలుగు రేడు మనకు వెన్నలొసగె
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి