నా తొలిసీసము
శివుని యాజ్ఞ చే నాచేరచింపడిన తొలిసీస పద్యము19-03-2018)
-------------------------------------------
నాగేంద్ర హారుండు నయాభిరాముడై
భస్మాంగరాగుడై భయముదీర్చు
నిత్యుడై శుధ్ధుడై నిగమైక వేద్యుడై
ఆనందతాండవం బాబు యెప్పుడు
డమడమధ్వనులతో ఢక్కానినాదంబు
నటరాజు మూర్తిగా నర్తనమ్ము
మూడుకన్నులతోడ ముల్లోకములనేలు
వెండికొండలసామి వేదమయుడు
ఆ.వె.గరళకంఠుడతడు కరుణార్ద్ర చిత్తుండు
భక్తజనుల కొంగుపసిడియెపుడు
అడగ కున్న నిచ్చె నర్ధాంగ భాగమ్ము
భధ్రమొసగునట్టి భావమయుడు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి