శ్రీశైల నాథుండు

శ్రీశైల నాథుడు శ్రీభ్రమరాంబతో
భక్తాళి నెల్లను బ్రోచునెపుడు
శ్రీశైల శిఖరంబు శ్రీఘ్రంబు గాజూచు
భక్తాళికెల్లను ముక్తికలుగు
పాతాళగంగయె పావనత్వంబివ్వ
అఘరాశియంతను నంతమగును
ఇష్ట కామేశ్వరి యిష్టార్థ మొనగూర్చ
పురుషార్థములపుడు పూర్తియగును
ఆ.వె.భక్తసులభుడతడు భవబంధములనెల్ల
భస్మరాశినంత భస్మపరచు
మనసుతోడనిచ్చు మారేడు పత్రిని
హర్షమందితాననందుకొనును
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత