దత్తాత్రేయుడు

అవనిలో నెవరయ్య నమ్మకన్న ఘనులు
అనురాగ మూర్తులై  యాదరింప
బ్రహ్మాది దేవతల్ పరవశంబునతాము
పసిపిల్ల లైనారు భాగ్యమొప్ప
వరమునొసగినారు వాత్సల్య మూర్తికి
పుత్రులైనారంత పుణ్య మొప్ప
దత్తావతారుడై ధరణిరక్షణచేయ
అనసూయ మాతయే యమ్మగా నుండగా
అత్రిమహర్షియే యయ్యకాగ
యవతరించినతడుయవనిలోన
ఆ.వే.భక్త వత్సలుండు భవబంధ ముల్ ద్రుంచి
ముక్తి పథము చూపు మోహనుండు
బాహ్య దృష్టి కతనిపట్టుకొనగలేము
పరమ తత్త్వ మయత పరుగు నతడు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత