వీరి సైనికుని చివరిసందేశము
వీరి సైనికుని చివరి సందేశము
---------+++--+++----++++-----
సాగనంపుడునన్నుసదనమ్మువరకు
రణరంగ భూమిలో రాలగానె
పతకమ్ములన్నియుపదిలమౌరీతిగా
కాయమ్ముపైనింక కప్పవలయు
అమ్మతో చెప్పండియధ్భతంబౌరీతి
సమరాన సమరంబు సల్పినట్లు
తల్లడిల్లవలదంచు తండ్రికి చెప్పండి
చింతింపవలదంచు చివరి పలుకు
ఆ.వె.అలసి సొలసినాను నాదమరచినిద్ర
చెందితంచు తెలుపు చెలియకింక
జనని గర్భమందు జన్మించి నందున
మరువకుండతురె మాతృరుణము
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి