ఆంగ్ల దోపిడీ
వర్తకమన్నారు వ్యాపార మన్నారు
ఉన్నసొత్తంతయు నూడ్చినారు
మనలోనమనకంత మాత్సర్యంబునెరపి
తంపుపెట్టిరకట తగవు పెంచి
విభజించి పాలించు వికృతమౌ క్రీడలు
అలవోక వీరంతయాడినారు
కోహినూరత్నాన్ని కొల్లగొట్టినారు
ఎత్తికెళ్ళిరకట యెంతొవిలువయిన
వస్తుజాలములెల్ల వాస్తవమ్ము
ఆ.వె.పాడియావు కాస్త గొడ్డుటావుయటుల
మార్చ జూసినారు మభ్యపెట్టి
దొరలు కాస్త వారు దొంగలైరియకట!
ఇట్ఝికథలు జూడ యేహ్యమగును
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి