లోకమాన్య బాలగంగాధర తిలక్

లోకమాన్యుడితడు లౌక్యమసలులేని
ధీరవరుడితడు ధైర్యశాలి
స్వాతంత్ర్య మేనాదు సహజమౌహక్కుంచు
సింహనాదముచేయు సింగమోయి
కర్తవ్య నిర్వాహకర్మయోగమ్మును
నిష్టగా పాటించు నిపుణుడితడు
 గీతారహస్యజేగీయుమానుండుగా
మన్ననలందిన మాన్యుడితడు
గణపతి నవరాత్రి కారణభూతుండు
స్వాతంత్ర్య సారధ్య సాధకుండు
ఆ.వె.మాతృదేశభక్తి మహనీయ సత్కర్తి
ఇతనిలోన బాగ యిమిడిపోయె
కర్మయోగియితడు కర్తవ్య నిష్టుడు
మనకు యితడె కాడె మార్గదర్శి
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత