నటరాజు--నటయేసు
నటరాజు వేషాన నర్తనంబాడగా
ఏసుకెట్లుకుదురు యెక్కడైన
శిలువనెక్కునుగాని శూలంబు త్రిప్పునా?
తాండవంబాడగా త్రాణలేదు
దిక్కులే వస్త్రాలై దీపించు శివుడంత
దుస్తులె లేకుండా క్రీస్తు డెట్లు
భస్మాంగరాగియై భవరోగ వైద్యుడై
మూడుకన్నులతోడ మురియు శివుడు
ఆ.వెకాలకూటమంత కంఠంబులోదాచి
అమృతమొసగునట్టియభవుడతడు
అట్టి శివునిపోల్కెయవసరంబెట్లాయె
తలచిచూడమోయి తత్త్వమెరిగి
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)
అమృతమొసగునట్టి యభవుడతడు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి