ఇలవేల్పు వలెలాంబ
శ్రీమాత చరణాలుచిత్తాన నిలిపిన
వంశాన జనియించు వరముదక్కె
ఇందిరా తీరాన యిలలోన లలితాంబ
వలెలాంబ గావచ్ఛె వరములొసగ
గురువైన తల్లైన కోడిమూరమ్మయె
మోటప్పతాతతో మొదులుగాగ
వేదాలు శాస్త్రాలు వేదాంత యోగంబు
కరతలామలకమై కరపెమాకు
అనధీతమైననునప్రధీతమౌరీతిగా
వంశానికంతను వరమునొసగ
ఆ.వె.ఏడుగడగ నీవు యేలికైనావమ్మ
కంటిరెప్పవోలె కాచినావు
నిన్ను నమ్మినా ము నిరతంబు మమ్మంత
కన్నతల్లి వోలె కావు మమ్మీ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి