సాపేక్ష సత్యము

సాపేక్ష సత్యంబు సర్వసమ్మతమిది
కావరమ్ముకలుగు కాసులున్న
ధనములేనినరుని దరిచేరనివ్వరు
లోకమందు నరుడు లోకు వగును
చెరువునిండినపుడు చేరును కప్పులు
వావివరుసలంచు వరుస బెట్టి

పదవికలుగగానె పంచను చేరిన
భాంధవ్య మును చుండ్రు బంధుజనులు
ఆ.వే.కలిమి లేము లందు కష్టసుఖములందు
నీడవలెను తాను నిలుచు సఖుడె
పూర్వ పుణ్యమట్లు పుడమిలో లభియించు
నాగరాజు మాట నమ్ము మోయి
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత