వరదకటి హస్త వరదుడతడు

భవాబ్ది తరియింప భవ్యమౌ కటివర్తి
హస్తంబు చూపించు నత్యుచుండు
వాంచితార్థమొసగు వరదహస్తంబును
ధరియించినాతడు దయను చూపి
శంఖంబు నొకచేత చక్రంబు నొకచేత
ధరియించి నాతడు ధరణి కాచు
కరిరాజు రక్షింప కారుణ్యమూర్తిగా
అవనికేతించిన అచ్యుతుండు
ఆ.వే.అతని శరణు వేడ యనిశంబు రక్షించు
ఆత్మ బంధు వెవరు యతనికన్న
భక్తజనుల కెల్ల పారిజాతసముడు 
అతని కెవరు సాటి యనికన్న
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత