నహుషు గర్వము

నహుషగర్వమునంత నగుబాటు చేసిన
గర్వాని కెంతయో గడుసుదనము
ఇంగితమ్ముమరవ యింద్రపదవి యూడె
అజగరంపు బ్రదుకు యతికె నౌర
పదవిభ్రష్టమగుట పాపాత్ముడౌటయె
పలితమ్ము గా వచ్చె  బ్రతుకు చివరి
గర్విష్టి గర్వమ్ము కర్వమ్ము యైనంత
శోకమెకటి దక్కు లోకమందు
ఆ.వే.అహము కలిగె నేని నాత్మీయ భావమ్ము
అడగి పోవు నోయి యవని యందు
ఆదరింప రెవరు నాత్మీయు లైనను
వ్యర్థ మగును బ్రతుకు వాస్త వమ్ము
(రచన:-విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)
ఆత

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత