దశావతారుడు

మత్స్యావ తారుడై మాధవుండంతట
వేదాల కాచిన వేదమయుడు
కూర్మవతారుడై కూర్మితో మంధర గిరినంత
మోదంబుతొణకగా మోసెనతడు
కారుణ్య మూర్తి యై  కనకాక్షు నిర్జించి
ధరణికాచినయట్టి దామొదరుడు
నరసింహ మూర్తియై  దాక్షిణ్య శాలియై
కనకకశిపుసుతు కాచి నతడు
వామనమూర్తియై బలిచక్ర వర్తిని
పాతాళలోకన పంపె నతడు
భార్గవ రాముడై పాపిష్టి రాజులు
భరతమ్ము పట్టిన పరశు వతడు
ధరణిలో ధర్మమ్ము దాశరథి యైనిల్పి
రావణు వధియుంచురక్షకుండు
హలధారి యైనట్టి బలరామ మూర్తిగా
ఖలనిగ్రహముచేసె కార్య శీలి
భవ్యమౌ రీతిగా భగవద్గీతాభోద
కావించె కరుణతో  కదన మందు
కలియుగాంతామున కల్కావతారుడై
కలుషాత్ములనెల్ల కసిమ సంగు
ఆ.వే.ధర్మ రక్ష ణంబు ధాత్రిపై కావించి
మంచివారినెల్ల మనుచు కోర్కె
నీకు కలదు నిలను నీరజాక్షయనుచు
వేదమాత పలికె వేద వేద్య
(రచన:-విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత