సతీసహగమనం భారతీయ దృష్టికోణం
సతీ సహగమనమును సనాతానధర్మం ప్రోత్సహించలేదు.వేదోక్తధర్మం అంగీకరించలేదు.
భర్త మరణమును సహించలేని పతివ్రతా శిరోమణులు ఐఛ్ఛికంగా సహగమనమూను చేశారు. రామాయణ భారతాలే ఇందుకు దృష్టాంతాలు.దశరథుని మరణానంతరము కౌశల్య సుమిత్ర, కౌకేయీలు సహగమనం చేయలేదు.పంచకన్యలలో ప్రసిధ్ధురాలైన రావణపత్ని మండోదరి సహగమనం చేయలేదు.కానీ ఇంద్రజిత్తు భార్య భర్తమరణాన్ని సహించలేక ఐఛ్ఛికంగా అగ్ని ప్రవేశం చేసింది.
విచిత్రమేమంటే దశరథుని తండ్రి, శ్రీరాముని పితామహుడైన అజమహారాజు కులగురువైన వశిష్టమహర్షి ఓదార్చినా భార్యావియోగాన్ని భరించలేక శరీరత్యాగంచేశాడు.ఇందుకు సాక్ష్యం కాళిదాస విరచిత రఘువంశ మహాకావ్యం.
అత్యద్భుత మైన ప్రేమకథ పైకి రాలేదు.
ఇక మహాభారతంలో శంతనుని భార్య సత్యవతి భర్త మరణానంతరం సతీసహగమనం చేయలేదు.అదే దారిలోనే విచిత్రవీర్యుడు అతనితమ్ముడు మరణించిన తరువాత వారి భార్యలు అగ్ని ప్రవేశం చేయలేదు.మహర్షి వేదవ్యాసని వర ప్రసాదం వల్ల ధృతరాష్ట్ర పాండురాజు లకు జన్మనిచ్చారు.
అలానే పాండురాజు మరణానంతరం కుంతీదేవి సహగమనం చేయలేదు.పాండురాజు మరణానికి కారణమనే భావనతో మాద్రి అగ్ని ప్రవేశం చేసింది.
ఏతావాతా తేలిందేమంటే సతీసహగమనం ఆచారం కాదు.కేవలం భర్త పై అంతులేని అనురాగంతో వియోగభారం భరించలేక తీసుకొన్న చర్య మాత్రమే.
ఇది కేవలం ఆంగ్లేయ విద్వాంసుల వక్రీకరణ మాత్రమే. దీనిని ఆధారం చేసుకొని మన వామపక్ష వాదుల వక్రీకరణ మహిళా హక్కుల వారి వక్రీకరణ మేరలు మీరింది.
మధ్య యుగాల్లో ముస్లిం దండయాత్రలో ఓడిపోయిన రాజుల సతీమణులు తాము పాతివ్రత్య పరిరక్షణకై అగ్ని ప్రవేశాన్ని మార్గం చేసుకొన్నారు.
తరువాతి కాలంలో ,అన్న పోనే పోయాడు, వదిన గారికి భాగం ఎందుకు పంచీయాలనే దురుద్దేశంతో సతీసహగమనం ఆచారంగా కొందరు దుర్మార్గులు చేసారు.కాబట్టి సనాతన ధర్మం ఆత్మహత్యాసదృశమైన సతీసహగమనమును ప్రోత్స హించలేదు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి