అడవి జంతువులు ఆవేదన

దారితప్పమెపుడు దారియే మావైపు
దాక్షిణ్యమేలేక దారితప్పె
మాదుమనుగడను మార్చదలచెనింక
అడవిజంతు బ్రతుకు నాగమాయె
పుడమియంతనుమీరు భుక్తపరుచుకొంట
ఘోరమౌనట్టిదౌ నేరమోయి
బుధ్ధిమార్చుకొనకమూఢమతులయిన
వల్లకాడగునింక వసుధయంత
ఆ.వె‌ .జగతియంత మీకు జాగీరుకాదోయి
స్వార్థ బుధ్ధి వదిలి సాగుమోయి
అఖిలజీవులకిదియావాస భూమిగా
ఎలుగుబంటి చాటె యిలను మనకు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత