కరోనా కోవిదత్వం
కోవిడు తానంతకోవిదత్వంబుతో
రోగంబు నటించి రోష్టుపెట్ట
ముప్పంచు జనులెల్ల మూతికిచిక్కాలు
భయముతోకట్టీరి భధ్రమనుచు
ఆలమందలపుడునాశ్చర్యమందగా
అదునుకలగెనేమొయవనిలోన
భౌతికదూరమెభధ్రమౌ మార్గము
ఇంతకన్నయుక్తియిలనులెదొ
వారాలు వర్జాలువచ్చాయివెళ్ళాయి
వాక్సిను వచ్చెటి వార్తలేదు
కడిగినచేతులె కడగంగకడగంగ
హస్తరేఖలిటులయరిగిపోయె
బడిలేక పనిలేక పంతుళ్ళుపస్తుతో
దినవెచ్చెమేలేక దీనులైరి
ఆలుబిడ్డలతోడయర్చక స్వాములు
తిండితిప్పలులేక దిగులుపడిరి
గ్రహణమ్ము తొలిగేటి కాలమ్ముకొరకునై
ఎదురుచూపెలెయింకమిగిలె
ఎన్నిరోజులుండుయెప్పుడు తగ్గునొ
ఎవరెరగురినట్టి యిడుములాయె
బడుగుజీవనంబు భ్రష్టు పరిచినట్టి
పొపకర్మ మట్లు పట్టెనకట
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి