లెక్కలు

లెక్కలె చేయని లెంకయైననుకూడ
గణితశాస్త్రమనిన కష్టపడును
ఛాత్రులెల్లరుకూడ శ్రధ్తతో చెవియొగ్గి 
విధిగాను వినునట్టి  వింత యిదియె
అడుగుతప్పినయంత పిడుగుపడుభయమ
పొందేటికష్టంపు పొంతయిదియె
నూటికినూరంచునూగిపోదురగాని
ముప్పదైయిదయిన ముప్పులేదు
అనునట్టి భ్రాంతియే నాదుకొనును
ఆ.వె.జైత్ర యాత్రలన్నె చేసిచేసియలసి
విజయమందువాడె వీరుడనుచు
భవన సంఖ్యచేత భాగ్యమొచ్చుననచు
అతిగ విశ్వసించునాశచేత
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)
భావన సంఖ్య=Hall ticket

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత