లౌకిక వాదము

కాదన్న మాదన్న కనుచూప మేరలో
చూపించ వలెనమ్మ తప్ప కుండ
పౌరహక్కులనుచు పొరపొచ్చు మాటల
కుట్రపన్నునరులు కుదురు చూడు
మతిమాలి వీరంత మారణ హోమాన్ని
ఎగదొపు చేయచు ఎగుర గలరు
విద్రోహ శక్తితో వీరంగ మాడుతూ
మానవ హక్కుల మాట పలకి
ఆ.వె.లౌకి కంబుయనుచు లోకువ మాటల
మంచి వారి మనసు మంట పెట్టి
కానివారికెల్ల కంచాల తిండిని
ఊన్నవారికేమొ ఊక పెట్టి
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి
ఉన్న ధర్మ మొకటె ఊరికే చెడబోకు 
ఆర్ష ధర్మ మెకటె అవని నేలు
కల్ల మతము లన్ని కనికట్టు విడగానె
గాలి కలసిపోవు ధూళి వలెనె నాగరాజశాస్త్రీ)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత