సోమేశ్వర లింగము
సోముండు నిలిపిన సోమేశులింగమ్ము
గునుపూడి వెలసిన గుర్తుయిదియె
తలపైన చంద్రుని ధరియుంచుటేకాదు
తనలోన దాచిన దొంగయితడు
పదహారుకళలెల్ల పండువెన్నలరీతి
కనికట్టు కట్టెడు కర్త యితడె
రాజరాజేశ్వరీ రాజ్యంబు చేయగా
సర్వజనులకెల్ల సంతసమ్ము
మాజనార్దనుడంత మమ్మేలు చుండగా
మాకేమిలోటోయి మహిని సుమ్ము
చాళుక్య భీముండు శాశ్వతంబౌరీతి
గుడినినిర్మించెగా గొప్పగా ను
ఆ.వె.భీమవరములోనసోమేశ్వరుండంత
వెన్నెలట్లుతాను వెలసినాడు
అతనికరుణకొరకుననునిత్యమర్థించ
జన్మసఫలమగుట సత్యమింక
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి