రేలంగి వెంకట్రామయ్య
తెలుగుహాస్యరసము వెలుగుపువ్వులుపూసె
నవ్వుకితడురేడు నవనిలోన
వెకిలిహాస్యంబంత వెదికినా దొరకదు
ఆరొగ్య కరమైన హాస్యనటుడు
చిరునవ్వుకతడంత చిరునామ మాకంత
రేలంగి నిజమైన రేడుమాకు
పెదవివిరుపులోన పెనునవ్వు పుట్టించు
మంత్రమే మొరుగుని మంత్ర గాడు
ఆ.వే.ఇంటిపేరుతోడ యీలోకాన్నిగెలిచి
వూరిపేరు కతడు వన్నె తెచ్చె
అట్టి నటుని మనము నాదర్శ వ్యక్తిగా
ఆదరించి నారు నాంధ్రులెల్ల
(రచన:---విద్వాన్ గోల్లాపిన్ని నాగరాజు శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి