కాళికాదేవి

కాళికా దేవంచు కంగారు పడకండి
కరుణించి కాపాడు కన్నతల్లి
తనయుండు నేరమ్ముతాజేయ దండించి
దారిలో పెట్టెడు తల్లిదానె
అవగుణములనెల్లను నావలతొలగించి
మంచిదారిని పెట్టు మాతృమూర్తి
ఆర్తితో పిలువగా యప్పుడేయరుదెంచి
కంటికిరెప్పలా కాచుతల్లి
పుర్రెలమాలంచు పుంజాలు తెంపుకు
పారిపోకండిరో పందలట్లు
క్షరముకా నట్టియ క్షరమామయనునట్టి
అమ్మమెడనునున్నహారమోయి
ఆ.వె పరమపదము నిచ్చు పరమాత్మరూపమ్ము
మాయతెరను ద్రుంచు మాతృమూర్తి
నోచువారికెపుడునోములపంటగా
భక్తసులభయైన భధ్రమూర్తి
(రచన;--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత