కార్తీక చంద్రుడు
కార్తీక చంద్రుడు కాంతిని వెదజల్లె
నిండుహృదయముతో నిండుగాను
వెన్నెల రేడంత వెలిగించె మనసంతా
సంతోషం మందెను జనుల మనసు
పాలకడలిలోని పసిపాపడట్లుగా
పండువెన్నలనెల్ల పంచుమనకు
రజనీశు లేనట్టి రాత్రంతా మనకెంతొ
కలలెల్ల లేనట్టి కాళరాత్రి
ఆ.వే చందమామ యనుచు జాబిల్లి రమ్మంచు
అమ్మ లెల్ల నిన్ను నాదరించ
మాకు నీవె మేనమామ యయితివయ్య
నీవు లేక మేము నిలువ లేము
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి