చిన్నారి కృష్ణుడు

చిరునగవులొలుకు చిన్నారి కృష్ణుండు
చూడచక్కని మూర్తి చూడరండి
మృణ్మయతనొదిలి చిన్మయుండాయెగా
తిలకించ మనసంత పులకించు
మాటలకందని మాధుర్యమూర్తిగా
మనవద్ద కొచ్చిన మాధవుండు
రేపల్లె గొపకుల్ రేవగలు తిలకించి
పులకించినారౌర పుణ్యమూర్తి
ఆ.వే.శిల్ప వేత్త కృషికి చిన్మయ మూర్తియే
దొరికె నాడు తాను దొడ్డ బుధ్ధి
అందు జేయరండి యభినందములంత
ధాత పపోలి నట్టి దొడ్డ యతడు
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత