ఆటవెలదు2

సత్య మున్న చేరుసంపదల్ వెంటనె
ఈవి యిచ్చు కీర్తి యిలను మనకు
సాధనమ్ము చేత సాధించు విద్యను
కర్మ ననుసరించు  కార్యముండు

దీప కాంతి తోడ తిమరంబు నశియించి
వెలుగు పూలు తోడ వెలుగు మనసు
కష్ట జీవిపైన కాసంత మనసున్న
చిమ్మ చీకటంతచీల్చ గలము

గడ్గుకాలమంచుగడ్డంబు పెంచగా
పేదవాడి వనుచు పెదవి విరిచి
దరిని చేర రెవరు దారిబోవు   దయ్యంబు
మనకు నేలయనుచు 
అమ్మ మమత లాంటి నాంధ్రభాషనునేర్వ
తేనెలూరు  తెలుగు తెలీసి పలుక
పూర్వ జన్మ లోని పుణ్యంపు  వశమున
జన్మమెత్తినావు జగతిలోన

రాలి పోవనేమి రంజిల్లు వనమంత
క్షణము కాలమున్న చాలు బ్రతుకు
రాగమందు కొన్న రంజిల్లనూ వచ్చు
బాగలేక పోవ బడలి కొచ్చు

తావి లేని పూవు ధరలోన కొరగాదు
పూవులేని తావి పుడమి లేదు
బుధ్ధిలేని నరుడు పుడమికే భారమ్ము
మంచి తనము లేక మనుగ డేహడి
మాయ మర్మ మంత మనకు తెలియగానె
గురువు నొద్ద జేరి నోరు తెరచి
మాయతెరను ద్రుంచు మర్మమెరగవలయు
జ్ఞాని జ్ఞాత  జ్ఞాన  జ్ఞప్తి తెలియు

మూలమందు.కలదు పుణ్యనదులెల్ల
వేల్పులెల్ల మద్య వెలసినారు
అగ్రమందు.వెలసె ఆమ్నాయ సారమ్ము
వందనాలు తులసి వనము నీకు

మొక్క దశను విడిచి మొండిదశకువచ్చె
బాల్యమంత యింక బండలాయె
మ్రానులైరి వీరు మాన్యులు కాలేక
దుఃఖ మొకటి మిగులు దురిత మొదవ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత