గురువు
గురుకృప చేతనే గుప్తమౌ జ్ఞానమ్ము
అభివ్యక్తమౌనోయి యవనిలోన
అజ్ఞాన తిమిరమ్మునంతంబు చేయగా
జ్ఞానగ్ని రగిలించి జ్ఞాతపరచ
గురువండవలయును కువలయంబందున
అజ్ఞాన మణగారు యతనిచేత
గురువౌనుబ్రహ్మమ్ము గురువౌను విష్ణుండు
అంబికానాథుడె యాదిగురువు
పరమమౌ బ్రహ్మమే పరమగురవుయంచు
నిఖిలశాస్త్రచయమునిశ్చయించె
ఆవె.వేద విద్యనంత వేద్యంబు సేయగా
అవని లోన గురువునరుగు దెంచె
భుక్తి నిచ్చు చదువు ముక్తినొసగువిద్య
అతని వలనకాదె యందుకొనగ
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి