ఉద్యోగ విజయాలు
ఉద్యోగ విజయాలు నూరకేరావోయి
కష్టించువారికే కలుగు ఫలము
అణుమాత్రమిందులో ననుమానమేలేదు
విజయమ్ము పొందగా విలువ పెరుగు
ఓర్పున్న వారంత నేర్పుతో కృషిచేయ
దుర్భిక్షమంతయు దూరమగును
లక్ష్యంబై నీదృష్టి లక్ష్యమైయున్నచో
గెలుపేమొ నీముందు నిలిచి యుండు
ఆ.వె.విజయ సూచనిదియె విజయదశమినాడు
సాధనంబు చేత సాధ్య మగును
కష్ట కార్యమైన యిష్టపడినచాలు
నాగరాజ మాట నాణ్యమోయి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి