నటరాజు

భువనాళికెల్లను భూతేశుడుండగా
అరవుభూతములేల యవనికిపుడు
తాండవ బాడగ తల్లడపడుటెయె
జరుగవలయునింక జగతికంత
భూతాల నాడించు భూతేశుడుండగా
అన్యభూతసమితి యవసరమ్మె
ముక్కంటి దయవేడ ముప్పంత తొలిగెను
కరుణించ మనివేడ కరుగునతడు
ఆ.వే ఆర్త జనుల రక్ష యనిశమ్ము చేయగా
దీక్ష బూని నట్టి తీక్ష్ణ  దృష్టి
అతని రక్షచాలుమాకనవరతము
అన్యులేల మాకు హరుడు చాలు
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత